రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు

మేడ్చల్ లో అధికారులు, సిబ్బంది నిర్వాకం

 రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు

జాతీయ రహదారిపై సమగ్ర కుటుంబ సర్వే ఖాలీ దరఖాస్తుల పత్రాలు దర్శనం

అవి ఖాలి పత్రాలు అంటున్న అధికారులు...

మేడ్చల్,ప్రజాస్వరం,నవంబర్ 15IMG-20241115-WA0003

మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో గల 44వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వినియోగించే దరఖాస్తు ఖాలీ  పత్రాలు నిర్లక్ష్యంగా రోడ్డుపై పడివుండటం మేడ్చల్ పురపాల సంఘం ప్రజల ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ పరిస్థితిని అధికారుల పర్యవేక్షణ లోపంగా  ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేలో ఇటువంటి నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయం పై మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డిని వివరణ కోరగా అవి ఖాలీ పత్రాలనీ తెలిపారు... వాటి తో ఎలాంటి ఇబ్బంది లేదని వాటిలో ఎవరి వివరాలు పూర్తి చేయలేదని ఆయన వివరించారు. ఇతర జిల్లాలకు చెందించిగా భావిస్తున్నట్లు తెలిసింది.

Related Posts