త్రిశక్తి క్షేత్రoలో...హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఆలయ అభివృద్ధికి...తన వంతు సహకారం అందిస్తా హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్

త్రిశక్తి క్షేత్రoలో...హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్  ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

గజ్వెల్  :  ప్రజ్ఞాపూర్ లోని త్రిశక్తి ఆలయ అభ్యున్నతికి తన వంతు సహకారం ఉంటుందని హైకోర్టు న్యాయవాది, నాచగిరి ట్రస్టు బోర్డ్ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులకు తన వంతు విరాళంగా రూ 25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ ఆలయాలకు పుట్టినిల్లుగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రకృతికి ప్రతిరూపాలైన గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచే జరుగుతుందని తెలిపారు. ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, తద్వారా మానసిక ప్రశాంతత దక్కుతుందని  అన్నారు. కాగా మొదటగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, ఆలయ కమిటీ సభ్యులు కదుల్ల రామరాజు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.3456

Related Posts

Latest News

మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ  మనోహరబాద్ :  మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు...
ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు
త్రిశక్తి క్షేత్రoలో...హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు
నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మత్స్య కారుల అభివృద్ధికి కృషి : మెదక్ ఎమ్మెల్యే రోహిత్