ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు

ఏడుపాయల్లో  పూజలు చేసిన ఎస్పీ దంపతులు

దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు

మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వనదుర్గామాత కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సిబ్బంది వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎస్పి వెంట స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఆలయ సిబ్బంది ఉన్నారు.IMG-20241115-WA0007

Related Posts