మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
మనోహరబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్
మండల అధ్యక్షుడు వరగంటి మురళీ మాదిగ ఆధ్వర్యములో
మాదిగల ఆత్మగౌరవ మహ డప్పు ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల సమస్యలు పోఅరిష్కరించాలని ఏబీసీడీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
డాక్టర్ షేమిమ్ అక్తర్ గారు ఇచ్చిన నివేదికలొ లోపాలను సవరించాలాన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇద్దరి మాదిగలకు చోటు కలిపించాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణ మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు గ్రూపులు ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలన్నారు.
కార్యక్రమములో మండల ఎమ్మార్పీఎస్ అదికార ప్రతినిధి నాచారం అశోక్, మనోహరాబాద్ గ్రామ అధ్యక్షుడు బక్క శ్రీనివాస్,
మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తోళ్ళ వెంకటేష్ లతో పాటు ముఖ్య అతిథులుగా
జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి
జిల్లా అదికార ప్రతినిధి ఎన్నెల్లి సుధాకర్ మాదిగ మరియు వివిధ గ్రామాల అద్యక్షులు, కార్యకర్తలు నాయకులు పాల్గొని డప్పులు చప్పుళ్లతో ర్యాలీ చేపట్టారు.