నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే షురూ...
జిల్లా లో సర్వే 100% పూర్తి చేయడానికి పగడ్బందీగా చర్యలు...
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
మెదక్ నవంబర్ 09 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, సిపిఓ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్, బిసి, ఎస్సి,పంచాయతి రాజ్, డిఆర్డీఓ, మండల, మున్సిపల్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే కొరకు జారీ చేసిన బుక్ లెట్ లో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇంకా మిగిలి ఉన్న తాళాలు వేసి ఉన్న ఇంటి యజమానులకు సమాచారం అందించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహించాలని అన్నారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే పై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఏలాంటి సందేహాలు ఉన్న ఎంపిడిఓ, తహశీల్దార్ల దృష్టికి తేవాలని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ సర్వే నిర్వహణ ఫామ్ ని నింపే విధానం పై పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్న వాటిని 100% పూర్తి చేయాలని, సర్వే వెంటనే మొదలు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహణ కు ప్రభుత్వం ద్వారా ప్రొఫార్మాలు 8 పేజీల రూపంలో అందించడం జరిగిందని 01 నుంచి 14 వరకు సామాజిక వివరాలు, 15 నుండి విద్యా వివరాలు, 19 నుండి ఉద్యోగ ఉపాధి వివరాలు, 30 వ కాలం నుండి భూమి వివరాలు, 41 నుండి రిజిస్ట్రేషన్ వివరాలు, 45 నుండి రాజకీయ నేపథ్యం, 47 వలస నేపథ్యం, తో పాటు పార్ట్ 2 లో కుటుంబ సమగ్ర వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, సంబంధిత మున్సిపల్ కమిషనర్స్, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు