గజ్వేల్ రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం... మహిళ మృతి ... ముగ్గురికి తీవ్ర గాయాలు....

గజ్వేల్ రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం... మహిళ మృతి ... ముగ్గురికి తీవ్ర గాయాలు....

గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం మహిళ మృతి ...
ముగ్గురికి తీవ్ర గాయాలు....

 గజ్వేల్, నవంబర్ 2 (ప్రజా స్వరం ) :- 

కారు ఢీకోని మహిళ మృతి చెందాగా మరో  ముగ్గురికి తీవ్ర గాయలైన  సంఘటన గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. గజ్వేల్ సిఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం  సికింద్రాబాద్ బాద్ కి చెందిన మహమ్మద్ రాజా అతని కొడుకు ఖుజిమ్, కోడలు సకినాల్ లు రాజా  కారులో కుటుంబ సభ్యులతో  జనగామ నుండి సికింద్రాబాద్ వస్తూ మార్గమధ్యలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ శివారులో గల ఎస్ 4 హోటల్ వద్ద భోజనం చేశారు. హైదరాబాద్ వైపు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుండి హైదరాబాదు వైపు వస్తున్న మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్  రెడ్డి ప్రయాణిస్తున్న కారు మహమ్మద్ రాజా కారు ను  బలంగా ఢీ కోట్టింది. దీంతో సికింద్రాబాద్ కి చెందిన మహమ్మద్ జమీలకు త్రీవ గాయలు కాగా చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెకు వైద్యం అందించేదుకు పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినది తెలిపారు. ఆమె భర్త  మహమ్మద్ రాజా, కొడుకు, కోడలు లకు తీవ్ర గాయలు కావడం తో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ కిమ్స్ కి ఆసుపత్రి కి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపడుతున్నట్లు  సీఐ తెలిపారు.IMG-20241102-WA0004

Related Posts