ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తా రోకో చేసిన రైతులు

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం లో ఘటన

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తా రోకో చేసిన రైతులు

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన రైతులు...

20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం...

చిన్న శంకరం పేట 
నవంబర్ 3 
(ప్రజాస్వరం) : రైతులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తెచ్చి 20 రోజులైనా కొనుగోలు లేదని రైతన్నIMG_20241104_112302 లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా .. ధాన్యం మాత్రం సేకరించడం లేదని ఆగ్రహించిన రైతన్నలు చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మెదక్  రహదారిపై  బైఠాయించి రాస్తారోకో చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దు అని చెప్తున్న ప్రభుత్వం  మిల్లర్లకు వత్తాసు పలికే విధంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం చూస్తుందని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా  తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి వారిని శాంతింప చేసి ఆందోళన విరమింప చేశారు.

Related Posts