తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని
ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్ ఆగస్టు 16 ( ప్రజాస్వరం) :
తూప్రాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి అమర్ సింగ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులు. క్యాజువాలిటి, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, ప్లేట్ లెట్ మిషన్, ఐసీయు, జనరల్ వార్డు లను పరిశీలించి వైద్య సేవలకు వచ్చిన పలువురితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వైరల్ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న వ్యాధి గ్రస్థులు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు విధులలో అందుబాటులో ఉండాలని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కాచి చల్లార్చి నీరు తాగడంతో పాటు వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారించాలని పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలని చెప్పారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 46 వ్యాధిగ్రస్తులను పరిశీలించగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఏ ఒక్కరికి లేవని 10 టైఫాయిడ్ కేసులు మాత్రమే ఉన్నాయని వివరించారు. మెరుగైన వైద్య సేవలు అందించడం కొరకు అవసరమైన అంశాలపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు
జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సమన్వయంతో ప్రణాళిక బద్దంగా వ్యవహరించి ప్రజారోగ్య రక్షణ పై పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ రోగుల వివరాలను సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల ద్వారా వాట్స్అప్ ఏర్పాటు చేసి మండల అభివృద్ధి అధికారులకు సమాచారం అందించినట్లయితే గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ ఆశ, ఏఎన్ఎం, సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిసరాల పరిశుభ్రత సంతృప్తికరంగా ఉన్నాయని తదుపరి లోటుపాట్లను సరిదిద్దుకోవడం గురించి మండల ప్రత్యేక అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత నీరు నిల్వ ఉండు ప్రదేశాలను గుర్తించి నీరు నిల్వ లేకుండా చూసి నీరు నిల్వ ఉండు ప్రదేశాలలో శానిటేషన్ లో భాగంగా దోమల లార్వాలను నాశనం చేసేందుకు ఆయిల్ బాల్స్ వదలడంతోపాటు దోమల మందు పిచికారి చేసి తద్వారా వ్యాధులను నిర్మూలనకు చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాల బారిన పడిన రోగులను నిరంతర పర్యవేక్షిస్తూ ప్రత్యేక వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విష సర్పాల కాటుకు, కుక్క కాటుకు కావలసిన వాక్సిన్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు అనంతరం ఆర్డిఓ కార్యాలయం సందర్శించారు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల గురించి సిబ్బంది పనితీరు ఆయన చందర్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ కార్యాలయాలు పనితీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వివిధ సమస్యలపై కార్యానికి వచ్చే వారికి ప్రభుత్వ నిబంధన మేరకు పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆర్దీవో కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగై సేవలు అందించాలని ఆదేశించారు.