పేకాట రాయుళ్ళ అరెస్ట్
By Prajaswaram
On
పేకాటరాయుళ్ళ అరెస్ట్
రూ.1,07,500,...మూడు కార్లు స్వాధీనం
తూప్రాన్ ,నవంబర్ 3, ప్రజాస్వరం:
పేకాట ఆడే వారికి కఠిన చర్యలు తప్పవని తూప్రాన్ సీఐ రంగకృష్ణ హెచ్చరించారు. ఆదివారం శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఆయన తెలిపిన వివరాలు
శివంపేట మండలం శభాష్ పల్లి శివార్ లో హన్మంతు రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్. ఎస్ఐ శివానందo తో కలిసి దాడులు నిర్వహించామన్నారు.ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకునీ ఒక లక్ష ఏడు వెయ్యిల ఐదు వందల రూపాయలు, మూడు కార్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Related Posts
Latest News
09 Mar 2025 19:25:40
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ మనోహరబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు...