పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై కత్తితో దాడి

పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై కత్తితో దాడి

పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పై ప్రేమోన్మాది కత్తితో దాడి...
చేతి తీవ్రమైన గాయం ... 
దాడి చేసిన యువకుడు పరారీ.... 
యువతిని ఆసుపత్రికి తరలింపు..  

మెదక్ నవంబర్ 04 (ప్రజా స్వరం)


పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పై ప్రేమోన్మాది కత్తి తో దాడి చేసిన సంఘటన మెదక్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన దివ్య వాణి మెదక్ డిగ్రీ కళాశాల లో ఓపెన్ పరీక్షకు వచ్చింది. మెదక్ పట్టణం అవుసుల పల్లి లోని అమ్మమ్మ వద్ద అంటూ పరీక్ష రాస్తుంది. అదే క్రమంలో ఉదయం పరీక్ష రాసేందుకు వెళుతున్న దివ్య వాణి బెంగళూర్ కు చెందిన చేతన్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ప్రేమను విద్యార్థిని అంగీకరించలేదన్న కోపం తో పరీక్షకు వెళుతున్న దివ్య వాణి వద్ద కు వచ్చి ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పగలకొట్టి వెంట తీసుకు వచ్చిన కత్తి తో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న యువతి అడ్డుకునేందుకు ప్రయత్నించడం తో కత్తి చేతి పై కోసింది. దీనితో విద్యార్థిని చేతిలో నుండి తీవ్ర రక్తస్రావం వస్తుండడంతో స్థానిక చూసి కారులో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన చేతన్ అనే యువకుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.IMG-20241104-WA0009

Related Posts