ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్, (ప్రజాస్వరం ) ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకటించైనా తర్వాత... ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే మొదటి సారి కావడం బీటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుకు ప్రధాని సాయంత్రం 4.30 గంటలకు భేటీ కావాల్సి ఉండగా ... 15 నిమిషాలు ఆలస్యంగా వీరి సమావేశం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి ఇతర సమావేశాల్లో పాల్గొన్న కారణంతో చంద్రబాబుతో భేటీ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల బడ్జెట్ లో ఏపీకి సంబంధించి కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అమరావతికి రూ.15 వేల కోట్లతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని స్పష్టం చేసింది. ఈ అంశాలపై నేడు ప్రధాని మోదీతో సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తుంది.