ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

కాబోయే కొత్త సీఎం గా ఆతిషి మెర్లినా సింగ్
ఢిల్లీ సీఎం పదవికి  కేజ్రీవాల్ రాజీనామా

ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ రాజీనామా 
 కొత్త సీఎం గా ఆతిషి మెర్లినా సింగ్
ఆపద్ధర్మ సీఎం గా కొనసాగనున్న కేజ్రీవాల్ 
ఢిల్లీ  : 
న్యూడిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందించారు.  ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలంధరం కలిసి ఆప్ శాసనసభాపక్ష నేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన కేబినెట్ లోని మహిళా మంత్రి ఆతిషి మెర్లినా సింగ్ ను ఆప్ శాసనసభాపక్ష నేతగా ఆతిషిని  ఏకగ్రీవంగా కాబోయే కొత్త ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు.  మళ్లీ ఢిల్లీ ప్రజలు తనను సీఎంగా కోరుకుంటేనే ఆ పదవికి తీసుకుంటానని... ఇందులో భాగంగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని కేజ్రీవాల్ ప్రకటించారు.

Related Posts