కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం

కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారం

కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారం
హైదరాబాద్ : 
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2  ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది.  ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత  నాగపురి రమేష్ కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  తెలంగాణ ఆణిముత్యమైన దీప్తి జీవన్ జీకి నగదు పురస్కారం ఉద్యోగము తోపాటు ఇంటి స్థలానికి కేటాయించడం మరియు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడం పట్ల  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ తెలంగాణ యువతకు క్రీడాకారులకు ఆదర్శప్రాయం అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆమెను సముచితంగా గౌరవించడం బావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు789

Related Posts

Latest News

మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ  మనోహరబాద్ :  మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు...
ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు
త్రిశక్తి క్షేత్రoలో...హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు
నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మత్స్య కారుల అభివృద్ధికి కృషి : మెదక్ ఎమ్మెల్యే రోహిత్