నాగచైతన్య- శోభితల జాతకం.. వేణుస్వామికి షాక్.. కలుద్దామన్న మంచు విష్ణు..!
సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయాల వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇటీవల కాలంలో ఆయన చెప్పిన కొన్ని జోస్యాలు బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని అన్నాడు. అయితే.. అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకోగా.. వీరద్దరు కలిసి ఉండరు అంటూ చెప్పాడుదీంతో అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు వేణుస్వామిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ లు కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ విషయం పై స్పందించిన తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారద వేణుస్వామి పైన, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల జాతకాన్ని ఎందుకు చెప్పానో అన్న విషయాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా వేణు స్వామి తెలియజేశాడు. ఇంతకముందు నాగచైతన్య-సమంత జాతకాన్ని చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగానే చైతు, శోభిత జాతకాలను చెప్పానన్నాడు. రెండు నెలల క్రితం చెప్పినట్లుగా సెలబ్రిటీల జాతకాలను చెప్పనన్నాడు. ఆ మాట మీదే నిలబడతానన్నాడు. ఈ విషయం పై ఇప్పటికే మా అధ్యక్షుడు మంచు విష్ణుతో ఫోన్‌లో మాట్లాడానని అన్నాడు. మంచి నిర్ణయం తీసుకున్నానని ఆయన మెచ్చుకునట్లుగా తెలిపారు. త్వరలోనే కలుద్దామని విష్ణు చెప్పినట్లుగా వేణు స్వామి తెలిపారు.