Breaking: యంగ్ టైగర్ కు యాక్సిడెంట్.. మణికట్టు,వేళ్లకు తీవ్ర గాయాలు

జూబ్లీహిల్స్ లో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమచేతి మణికట్లు కు గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బతగలిందన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు గత రాత్రే తాను నటించిన దేవర మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపారు.

నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ల గండం ఉన్నట్లు గతంలో జరిగిన సంఘటనలు రుజువుచేస్తున్నాయి. అప్పట్లో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా తండ్రి హరి కృష్ణ కూడా అదే తరహాలో రోడ్డు యాక్సిడెంట్ కు గురై మృతిచెందారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ తమ సొంత బ్యానర్ లో రూపొందే సినిమాలకు ముందు మాటగా కారు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఓ మెసేజ్ కూడా ఇస్తున్నారు. హరికృష్ణ మరణానంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి ఇలాంటి మెసేజ్ తమ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ముందు ప్రకటిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.images (2)

Related Posts