వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌.. 
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్​‌కు భారీగా చేరుకున్న అభిమానులు  
- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌
ప్రజా స్వరం, నేషనల్ ​బ్యూరో : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్ వెల్‌కమ్ స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన  ఒలింపిక్స్‌ క్రీడల్లో వినేశ్‌పై అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కిలోల  విభాగంలో వంద  గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా ఫైనల్‌కు కొన్ని క్షణాల ముందు రెజ్లర్‌పై అనర్హత వేటు పడింది. దీంతో యావత్​ భారత దేశం తీవ్ర నిరాశ చెందింది. ఇక తన ‘అనర్హత వేటు’పై కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌)ను వినేశ్‌ ఆశ్రయించగా, అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌’తో కాస్‌ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల అనంతరం వినేశ్‌ తొలిసారి భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా పెద్దఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు వెళ్లారు. వారిని చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 
download (5)

Related Posts

Latest News

మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ  మనోహరబాద్ :  మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు...
ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు
త్రిశక్తి క్షేత్రoలో...హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు
నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మత్స్య కారుల అభివృద్ధికి కృషి : మెదక్ ఎమ్మెల్యే రోహిత్