హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు

 హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు  ట్రాఫిక్ ఇక్కట్లు

హైదరాబాద్ : 
 హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద  వాగు పొంగుతుండటంతో  నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు.

దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వైపు వెళ్లే  వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం మీదుగా మళ్ళిస్తున్నారు.

Related Posts